telugu navyamedia
ఆరోగ్యం

మధుమేహం వున్నవాళ్లు మామిడిపండ్లు తినవచ్చా…

mango

మామిడి పండు పేరు చెబితే చాలు ఎవ్వరికైనా నోరు ఊరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో మామిడి ఒకటి. ఈ పండు నచ్చని వారంటూ ఉండరు. మామిడి రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఏంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మామిడిలో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. మామిడిలో ప్రోటీన్ విచ్ఛిన్నం, జీర్ణక్రియకు సాయపడే ఎంజైములు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మామిడి పండు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి డైటరీ ఫైబర్ సాయపడుతుంది. పండిన మామిడి కంటే ఆకుపచ్చ మామిడిలో పెక్టిన్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వ్యక్తులు మామిడి పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది. మామిడి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. సగటు పరిమాణంలో ఉన్న మామిడిలో రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ సి మూడింట రెండు వంతుల వరకూ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మామిడి పండులో లభించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారిస్తుంది. మామిడిలో ఉన్న ఈ పోషకాలు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరచటానికి సాయపడుతుంది మరియు శరీరాన్ని బలంగా చేస్తుంది.

మామిడి పండు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పండుని మీ ‌డైట్‌లో చేర్చండి. మామిడి పండులో కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. మామిడి పండ్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది విటమిన్ ఎ ఉత్పత్తికి సాయపడుతుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. ఈ పండులోని విటమిన్ ఏ, కెరోటిన్ దృష్టి నష్టాన్ని నివారిస్తుంది. వయసుకు సంభందించిన కంటి వ్యాదులైన మాక్యులర్ క్షీణత, దృష్టి కోల్పోవడాన్ని, కంటి శుక్లాం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి పండు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సిలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండూ ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తాయి. మామిడి పండు తినడం వల్ల చర్మ మృత రంధ్రాలు ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, తొలగించడానికి కూడా సాయపడుతుంది. మామిడి పండ్లలోని ఫైబర్ విషంతో నిండిన మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే మామిడి తప్పక తీసుకోండి.

మధుమేహ వ్యాధిగ్రస్థులు మామిడి పండు తినకూడదనీ, తింటే ప్రమాదమన్న అపోహలు చాలానే ఉన్నాయి. ఈ పండులోని గుణాలు టైప్-2 డయాబెటీస్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయని అనేక పరిశోధనలు చెపుతున్నాయి. అందుకే మధుమేహం ఉన్న వారు కూడా మామిడి పండు రుచులను ఆస్వాదించవచ్చు. మామిడి పండు యొక్క గ్లైసెమిక్ సూచిక 41 నుండి 60 మధ్య ఉంటుంది, 51 విలువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్ యొక్క దిగువ చివరలో ఉంది. 55 కన్నా తక్కువ ఉన్న ఆహారాలు తక్కువ గ్లైసెమిక్ ఆహారంగా పరిగణించబడతాయి, అందుకే మామిడి పండు మధుమేహ ఉన్నవారు తినడానికి సురక్షితం. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు, రక్తంలో చక్కెర విడుదల నెమ్మదిగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, మామిడి పండ్లలో కూడా ఫైబర్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడి మితంగా తింటే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మామిడిపండ్లలో ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు. ఇది మంచి ఎనర్జీని అందిస్తుంది.

Related posts