telugu navyamedia
రాజకీయ

జార్ఖండ్‌‌లో విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్..

జార్ఖండ్ రాష్ట్రంలోని విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం సోరెన్ సర్కార్ కు మద్దతుగా 48 ఓట్లు పడ్డాయి.

అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్షలో 81 మంది సభ్యులు పాల్గొనగా.. సోరెన్​కు 48 మంది సభ్యులు మద్దతు తెలిపారురు

విశ్వాస పరీక్షలో నెగ్గిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యంత్రి హేమంత్​ సోరెన్​ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..కమలం పార్టీ ప్రతిరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి.. ప్రతిపక్ష బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సోరెన్ ఆరోపించారు. అయినప్పటికీ సభలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రజలు వస్తువులను కొనుగోలు చేస్తారని.. బీజేపీ మాత్రం శాసన సభ్యులను కొనుగోలు చేస్తుందని ఆక్షేపించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ  కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. 

జార్ఖండ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు.

Related posts