telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు

hema is first elimination from bigg boss 3

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో ఫస్ట్ ఎలిమినేటర్ గా హేమ బయటకు వచ్చింది. మొదటి వారం మోనిటర్ గా ఉన్న హేమ ఇంట్లోకి వెళ్లిన రెండో రోజే ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో రాహుల్ తో గొడవ పెట్టుకుంది. అంతేకాదు తను మాట్లాడింది తప్పని తెలిసినా సరే మిగతా ఇంటి సభ్యుల మాటలను పట్టించుకోకుండా తన దారి తనదే అన్నట్టు ప్రవర్తించింది. అందుకే ఇంట్లో హౌజ్ మెట్స్, బయట ఆడియెన్స్ అందరు హేమకు నెగటివ్ మార్కులు వేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎలిమినేటర్ గా హేమ ఎలిమినేట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 మొదటి వారం కోటి 30 లక్షల ఓట్లు వచ్చాయని వెళ్లడించాడు నాగార్జున. ఫైనల్స్ వరకు బాబా భాస్కర్, శ్రీముఖి వచ్చే అవకాశం ఉందని చెప్పారు హేమ. ఇక సర్ ప్రైజ్ గా మొదటి ఎలిమినేటర్ అలా వెళ్లగానే ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా సింహాద్రిని పంపించారు. ఒక ట్రాన్స్ జెండర్ అయిన తనని ఇలా బిగ్ బాస్ హౌజ్ లో సెలెక్ట్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తమన్నా సింహాద్రి చెప్పారు. ఎలిమినేష‌న్ పై ఇప్పుడు హేమ స్పందించారు. త‌న ఎలిమినేష‌న్ అనేది కుట్ర పూరితంగా సాగింద‌ని చెబుతుంది ఈమె. అస‌లు త‌న‌ను ప్లాన్ చేసి బ‌య‌టికి పంపేసార‌ని.. ఇంట్లో ఉన్న వాళ్లంతా అక్కా అక్కా అంటూనే తొక్కేసార‌ని ఆవేద‌న వెల్ల‌బోసుకుంది హేమ‌.

అస‌లు విష‌యం దాచిపెట్టి ప్ర‌పంచానికి మాత్రం జ‌ర‌గ‌నిది చూపించారంటూ మా టీవీపై కూడా అక్క‌సు వెల్ల‌గ‌క్కింది హేమ‌. అస‌లు ఇంట్లో జ‌రిగింది వేరు.. బ‌య‌ట చూపిస్తుంది వేర‌ని చెబుతుంది హేమ‌. ఎలిమినేట్ అయిన‌పుడు నాగార్జున ముందు అంతా బాగుందని చెప్పిన హేమ‌.. ఇప్పుడు మాత్రం మాట మార్చేసింది. అక్క‌డంతా హ్యాపీ అని చెప్పిన ఈమె.. ఇప్పుడు మాత్రం కావాల‌నే త‌న‌ను ప్లాన్ చేసి మ‌రీ బ‌య‌టికి పంపించార‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ రోజు రాహుల్ సిప్లిగంజ్‌తో జ‌రిగిన గొడ‌వ కూడా మ‌రోలా ఉంద‌ని.. అక్క‌డ కార‌ణం వేరే వాళ్లు అయినా కూడా తానే గొడ‌వ‌కు కార‌ణం అన్న‌ట్లు ప్ర‌సారం చేసార‌ని చెబుతుంది హేమ‌. త‌న‌పై ముందు నుంచి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించార‌ని చెబుతుంది ఈ సీనియ‌ర్ న‌టి. అంతేకాదు తొలిరోజు త‌న‌ AV కూడా వేయలేద‌ని.. ఈ విష‌యంపై అడిగినా ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ని చెబుతుంది ఈమె. లోపల జరిగిన గొడవ వేరని.. తానే వాళ్ల‌కు సర్దిచెప్పానని.. కానీ అక్క‌డ మాత్రం తానే గొడవపడ్డట్టు ప్రసారం చేశారని చెప్పుకొచ్చింది హేమ‌. ఇక ఓట్ల విష‌యంలో కూడా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని చెబుతుంది హేమ‌. గూగుల్‌లో ఎక్కువ ఓట్స్ వచ్చాయని.. కానీ హాట్ స్టార్‌లో మాత్రమే ఓట్ వేయాలని క్లియర్‌గా చెప్పలేదని చెబుతుంది హేమ‌. ఇక త‌న‌ను ప్ర‌మోట్ చేసేలా ఓ ప్రోమో ప్లే చేస్తామ‌ని చెప్పిన మా టీవీ.. ఆ త‌ర్వాత చేతులెత్తేసింద‌ని చెబుతుంది. దీనిపై వాళ్ల‌ను అడిగినా కూడా నో రెస్పాన్స్ అంటుంది ఈమె. మొత్తానికి త‌న‌ను అక్క అక్క అంటూనే.. త‌న‌పై లేనిపోని మాటలు చెప్పి.. అంతా క‌లిసి ఇంటి నుంచి తోసేసార‌ని ఆవేద‌న వెల్ల‌బోసుకుంది హేమ‌.

Related posts