telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లపై హేమ కామెంట్స్

Hema
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ మంచి గుర్తింపును, ప్రేక్షకాదరణను పొందింది. ఇటీవల “మా” ఎన్నికల్లో పాల్గొన్న హేమ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి తనదైన శైలిలో స్పందించింది. “షూటింగు స్పాట్ లో మహేశ్ బాబు నన్ను బాగా ఆటపట్టిస్తుంటారు. నేను అద్దం చూసుకుంటూ వుంటే .. ‘మీకసలు ఫేసే లేదు .. ఎందుకు అద్దం చూసుకుంటున్నారు .. అద్దం పక్కన పెట్టండి’ అంటారు. ‘పోకిరి’ సినిమా వరకూ మీరు అమూల్ బేబీ .. చాక్లెట్ బాయ్ లా కనిపించారు. అందువలన నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ‘.. పోకిరి’ తరువాతనే మీరు మగాడిలా కనిపించారు’ అంటూ నేను కూడా ఆయనను ఆటపట్టిస్తాను. ‘ఈ తింగరితనం ముందునుంచి ఉందా .. మధ్యలో వచ్చిందా?’ అని ఆయన అంటారు. అలా ఒకరినొకరం ఆటపట్టించుకుంటూ ఉంటాము. సాధారణంగా ఆయన ఎవరితోనూ జోకులు వేయరు. అలాంటి ఆయన నాతో సరదాగా మాట్లాడతారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసిన ‘అన్నవరం’ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. ఆ సినిమాలో నేను ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పాను. ఆ సీన్ చూసిన పవన్ కల్యాణ్ గారు నా దగ్గరికి వచ్చి “హేమగారూ మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండీ. చాలా నేచురల్ గా ఉంటుంది” అన్నారు. అప్పుడు నేను థ్యాంక్స్ అంటే బాగుండేది .. కానీ నాలాగే మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండీ అన్నాను. అక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నేచురల్ గా చేస్తారని, కానీ నా నోటి నుంచి అలా వచ్చేసింది. అయినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను” అని తెలిపారు. 

Related posts