telugu navyamedia
telugu cinema news trending

“మా” ప్రెసిడెంట్ నరేశ్ తీరుపై హేమ ఫైర్

MAA

“మా” మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ‘మా’ అధ్యక్షుడు లేకుండానే జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ మెంటర్లు కలిసి సమావేశం నిర్వహించడం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే తన ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేశ్. అంతేకాదు సమావేశంపై లీగల్ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా నరేష్ వ్యాఖ్యలపై జీవిత, హేమ, జయలక్ష్మి స్పందిచారు. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ మీటింగ్ నిర్వహించడంపై ‘మా’ అధ్యక్షుడు నరేశ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మా ప్రెసిడెంట్ నరేష్ తీరుపై మా వైస్ ప్రెసిడెంట్ నటి హేమా మండిపడ్డారు. అంతకు ముందు శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నపుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు. అంతేకాదు జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునే అధికారం తనకుందని చెప్పారు నరేశ్. ఇపుడు అదే హోదాలో ఉన్న జీవిత రాజశేఖర్ సమావేశం పెడితే.. తప్పు అవుతుందా ? అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు హేమ నిలదీశారు. అంతేకాదు ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. అంతేకాదు నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన మొదటి జనరల్ బాడీ మీటింగ్‌లో చాలా గొడవలు జరిగాయన్నారు. ఆ సమయంలో నరేష్ తనకు నచ్చినవారిని మీటింగ్‌కు తీసుకొచ్చారు. ఆయన ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్ని చెప్పారు. ఆ సమయంలోనే నరేష్ తీరును చాలా మంది వ్యతిరేకించారు. గతంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అపుడు జనరల్ సెక్రటరీ హోదాలో మీటింగ్ పెట్టుకునేందుకు తనకు అన్ని అర్హతలున్నాయని అప్పట్లో చెప్పాడు. అంతేకాదు అప్పట్లో ఆఫీసుకు తాళం వేసుకొని వెళ్లారు. అపుడు మీరు చేసిందేమి తప్పుకాదు. కానీ ఇపుడు ‘మా’ జనరల్ సెక్రటరీ అయిన జీవిత ఫ్రెండ్లీ మీటింగ్ పెడితే మాత్రం మీకు తప్పుగా కనిపిస్తుందా ? మీకు అప్పట్లో ఉన్న హక్కు ఇపుడు జీవితకు ఉండదా అని ప్రశ్నించారు. మాపై పరువు నష్టం కేసులు వేసేందుకు.. మీటింగ్ సభ్యులు హాజరు కాకుకండా మెసెజ్‌లు పంపించి వారిని బెదిరించడానికి ఉన్న సమయం మీటింగ్‌కు రావడానికి మాత్రం ఉండదా అని నరేష్ తీరును ఎండగట్టారు. ఇప్పటి వరకు మీపై గౌరవంతో మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఎంతో గౌరవంతో మేము పెట్టుకున్న మీటింగ్‌ గురించి వివరణ ఇస్తున్నామంటూ ముగించింది.

Related posts

కేరళ : .. ఎర్నాకుళాన్ని .. నిఫా రహిత ప్రాంతంగా … ప్రకటన..

vimala p

“వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ” మా వ్యూ

ashok

ఇన్ఫోసిస్ సీఈవోపై సంచలన ఆరోపణలు… ఒక్క రోజులోనే రూ.43,925 కోట్ల నష్టం

vimala p