telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

భరత్ అనే నేను .. బాగా ఎక్కింది… హెల్మెట్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానా .. వెనక ఉన్న వారికీ తప్పనిసరట..

helmet for both is compulsory

తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ విషయంలో కఠిన నియమావళి తెచ్చిన విషయం తెలిసిందే. దీనితో హెల్మెట్‌ ధరించకుంటే రూ.వెయ్యి అపరాధ రుసుము విధించే చట్ట సవరణ అమల్లోకి తెచ్చేసింది. హెల్మెట్‌ లేకుండా బైక్ లు నడిపితే రూ.వెయ్యి అపరాధ రుసుము విధించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రభుత్వం.. ఈ నిబంధన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు వెల్లడించింది. అంతేకాదు బైక్ లో వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవలసిందే అని ప్రభుత్వం నిబంధన విధించింది.

వెనుక కూర్చొన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా కూడా రూ. వెయ్యి వసూలు చేయనున్నట్లు చెన్నై నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటనలో తెలిపారు. చెన్నై నగర పోలీసు సర్కిల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ అరుణ్‌ ఉత్తర్వుల మేరకు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపినవారి వద్ద నుంచి భారీగా అపరాధ రుసుం వసూలైంది. బైక్ పై వెనుక కూర్చున్న వారి వద్ద అపరాధాన్ని వసూలు చేశారు. ముఖ్యంగా చెన్నై కామరాజర్‌ రోడ్డు, ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు, ఓఎంఆర్‌ రోడ్డు, మౌంట్‌రోడ్డు, పూందమల్లి హైరోడ్డు సహా నగరవ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాలలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు జరిపి ఫైన్ వసూలు చేశారు. మోటార్‌ వాహన చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ జరిపి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.100 నుంచి రూ.1,000కి పెంచారు.

Related posts