• Home
  • వార్తలు
  • నేపాల్‌లో కూలిన హెలికాప్టర్‌… ఏడుగురు గల్లంతు
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్‌… ఏడుగురు గల్లంతు

Nepal, Helicopter, crashed in Nepal

సెంట్రల్ నేపాల్‌లోని కొండప్రాంతంలో ఇవాళ ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. అల్టిట్యూడ్ ఎయర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో పైలట్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఓ జపాన్ పర్వతారోహకుడితో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. శనివారం ఉదయం టేకాఫ్‌ అయిన హెలికాప్టర్‌ బయలు దేరిన కొద్దిసేపటికే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు.

ధడింగ్ జిల్లా సమీపంలో హెలికాప్టర్ శకలాలు కనిపించినట్టు కాట్మండూ ఎయర్ పోర్టు జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ వెల్లడించారు.ఘటనా స్థలాన్ని గుర్తించేందుకు హెలికాప్టర్లతో పాటు మైదానంలోనూ గాలింపు చేపట్టాం. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది అని ఆయన వెల్లడించారు.

 

Related posts

వెంకయ్య కార్యాలయంలో సుబ్బారావు, సత్యకుమార్

admin

కేసీఆర్‌ ముస్లింలను మోసం చేశారు: ఆజాద్‌

madhu

అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా: రాహుల్

admin

Leave a Comment