telugu navyamedia
సినిమా వార్తలు

భీష్మ : విలన్ గా క్రేజీ హీరోయిన్

hebba patel bold photo shoot

“శ్రీనివాస కళ్యాణం” చిత్రం అనుకున్న విజయాన్ని అందించకపోవడంతో త‌ర్వాత సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో నితిన్. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల‌ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతోంది “భీష్మ‌”. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం “భీష్మ‌” షూటింగ్‌తో నితిన్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలోని నితిన్ లుక్ బయ‌ట‌కు వ‌చ్చింది. పెద్ద‌గా ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండా డీసెంట్ లుక్‌తో స్మార్ట్‌గా ఉన్న నితిన్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. పెళ్లి అంటే ఇష్టం లేని ఓ కార్పొరేట్ ఉద్యోగి పాత్ర‌లో నితిన్ క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి, వెంకీ అట్లూరి సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ క్రిస్మస్‌కు సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తుందని తెలుస్తుంది. కుమారి 21ఎఫ్‌ సినిమాతో సంచలనం రేపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. మరి ఈ సినిమాతోనైనా హెబ్బాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Related posts