telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ ను చూసి నేర్చుకోండి… ఖాన్లపై మండిపడుతున్న నెటిజన్లు

khans

మనదేశంలో కరోనా మహమ్మారిని తరమేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా.. దాదాపు అన్ని రంగాల వారు వారి వారి శక్తి కొలది విరాళాలిస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ టాప్‌ హీరోస్‌ గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. కేంద్ర ప్రభుత్వానికి కరోనా నియంత్రణ సహాయం కింద ఏకంగా రూ.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి.. రియల్ హీరో అనిపించుకున్నారు. ఇక మన తెలుగు హీరోలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది సరే. అసలు సోషల్ మీడియా చెప్తున్న విషయం ఏంటంటే.. దేశంలో టాప్ హీరోలుగా అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంతవరకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని. అంతే కాదు.. ఈ ముగ్గురు ఖాన్‌లపై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. వీరు ఈ దేశ ప్రజల దగ్గరి నుంచి డబ్బులు సంపాదించి.. కనీసం కృతజ్ఙత లేకుండా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. మెజార్టీ ప్రజలు ఆదరించడం వల్లే.. వారు ఈ స్థాయికి ఎదిగారని.. కానీ వారు ప్రస్తుతం దేశానికి ఎలాంటి సహాయం చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల సహాయాం చేశారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ముగ్గురు ఏం సహాయం చేశారని ప్రశ్నిస్తున్నారు. వారి అధికారిక ట్విట్టర్‌లకు డైరక్ట్‌గా ట్యాగ్‌ చేస్తూ.. ట్రోల్‌కు దిగుతున్నారు. ఇక నుంచి వీరి సినిమాలు బాయ్ కాట్ చేయాలంటూ మరికొందరు పిలుపునిస్తున్నారు. దీంతో తాప్సీ ప‌న్ను, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్ర‌ముఖులు ముందుకు వచ్చారు. అయితే.. వీరందరికంటే ఓ అడుగు ముందుకేసిన.. సల్మాన్ ఖాన్ భారీ ప్రకటన చేశారు. ఏకంగా 25 వేల మందికి ఆర్థిక సహాయం చేయడానికి రెడీ అయ్యారు. త‌న‌ బీయింగ్ హ్యూమ‌న్‌ ఫౌండేష‌న్ ద్వారా.. రోజు వారీగా ప‌నిచేసే క‌ళాకారుల‌కు ఆర్థిక స‌హాయం అందించాల‌ని సల్మాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారని.. బీఎన్ తివారీ తెలిపారు. ఇక మిగతా ఇద్దరు ఖాన్‌లు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారి అభిమానులు చెబుతున్నారు.

Related posts