telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకలో కుండపోత వర్షాలు..వరదల్లో చిక్కుకొని 40 మంది మృతి

red alert in kerala on huge rains

కర్ణాటక రాష్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షాలకు తోడు వరదలు ఉప్పొంగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. మరో 14 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక 5,81,702 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

50,595 జంతువులను వరదల నుంచి రక్షించారు. 3,27,354 మంది 1168 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. ఈ భారీ వర్షాలకు, వరదలకు 17 జిల్లాల్లోని 80 తాలుకాలు తీవ్రంగా నష్టపోయాయి. 2028 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4.20 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Related posts