telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ లో భారీ వర్షం.. ఇళ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి

huge rain in hyderabad troubles normal life

హైదరాబాద్‌ నగరంలో బుధవారం మరోసారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, పంజాగుట్టలో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎర్రమంజిల్‌లోనూ జల్లులు కురుస్తున్నాయి. నగరంలో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నగర వాసులు సాధ్యమైనంతమేర కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో వరద నీరు నిలిచిపోవడం, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో ఉన్నాయని ఆయన తెలిపారు.

Related posts