telugu navyamedia
political Telangana

తెలంగాణ ఎన్నిక‌ల‌కు..90వేల మంది పోలీసులతో భారీ భద్రత

huge number of police in election duty
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రేపు జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 90వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 
పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు సుమారు 50 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. అటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 20వేల మంది తెలంగాణ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి.. తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేవరకు 90 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. ఎన్నికల సిబ్బందికి రక్షణగా ఉంటారు.

Related posts

ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సందేహం లేదు: కేసీఆర్‌

vimala p

ఏపీ టూ కెపి..తెలంగాణలో టీడీపీ నేతల తిష్ట

ashok

ముందడుగు వేయని.. హైదరాబాద్.. ఓటర్లు..

vimala p