telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs hyd

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. • కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేసిన కేటుగాడు…. మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజిన్ లో వాడే పరికరాలలో దాచాడు. కాబూల్ నుండి మోసుకొని వచ్చిన కారు ఇంజిన్ బాగాల పై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు…. ఇంజన్ బాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారుల బృందం. పరికరాల్లో దాచిన తెల్లటి పౌడర్ ను కనుగొన్నారు. మాదకద్రవ్యాలు ఎవరి కోసం తెచ్చారు అనే సమాచారాన్ని కూపి లాగుతున్న కస్టమ్స్ అధికారులు…. దీని వెనుక వున్న అసలు సూత్రధారి పై లోతుగా విచారణ చేస్తున్నారు. 

Related posts