telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఆరోగ్యంగా బరువు తగ్గే .. సూత్రాలు.. ఇవే..

most easy way to loose and maintain weight

అధిక బరువు భారతదేశంలో కూడా ప్రధాన సమస్యగా పరిణమించింది. దీనితో ఈ సమస్యపై అవగాహనా లేక చాలామంది తప్పుడు నిర్ణయాలు దీర్ఘకాలికంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసలు శరీర బరువును తగ్గించుకోవడానికి ఆహారాన్ని మానేస్తే నీరసం వస్తుంది. తద్వారా బరువు తగ్గేమాట అటుంచి, అనారోగ్యం పాలవుతారు. అందుకే స్థూలకాయం తగ్గడానికి కొన్ని వ్యాయామాలతో పాటు వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే మేలు.

* వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. ఇది ఆహారపదార్థాలకు రుచిని ఇవ్వడమేగాక కొవ్వును కరిగిస్తుంది.

* రోజూ పరగడుపునే పెద్దగ్లాసుడు నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. ఈ మిశ్రమంలో కొవ్వును కరిగించే గుణాలు మెండుగా ఉంటాయి.

* టమాటాలో క్యాన్సర్‌ కారకాలను నిర్వీర్యం చేసే లక్షణం ఉంది. అలాగే కొవ్వును నిరోధించే గుణమూ ఉంది. కనుక వంటకాల్లో టమాటాను విరివిగా వాడటం ఎంతో లాభదాయకం.

* రోజూ గ్రీన్‌ టీ తాగడం ఎంతో మంచిది. గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కొవ్వును కరిగించే లక్షణమూ మెండుగా ఉంది.

* క్యాబేజీలో స్థూలకాయాన్ని నివారించే లక్షణం ఉంది. అలాగే ఓట్స్‌, గుడ్ల వాడకమూ మంచిది ఓట్స్‌లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

* గుడ్లలో పోషకాలు బాగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువ. అందుకని ఓట్స్‌, గుడ్లు విరివిగా వాడటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

Related posts