telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా.. అయితే ఈ సంచలన నిజాలు తెలుసుకోవాల్సిందే !

గర్భ నిరోధక మాత్రల విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. గర్భ నిరోధక మాత్రలు వాడితే.. ఫ్యూచర్ లో పిల్లలు పుట్టారని, మహిళలకు అనేక లైంగిక సమస్యలు వస్తాయని ఎన్నో అపోహలు ఉన్నాయి. అలాగే మహిళల గర్భాశయం దెబ్బ తిని అనేక రోగాలు వస్తాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపద్యంలో  మహిళలు ఈ మాత్రల ప్రభావాల గురించి తెలుసుకోవడం, అపోహలను తొలగించడం ఎంతో అవసరం. గర్భ నిరోధక మాత్రల్లో ఉండే ప్రొజెస్టిన్ ఆకలిని పెంచుతుంది. కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ మాత్రలు వాడే మహిళలు ఆహార శైలిపై కన్నేసి ఉంచాలి. గర్భం దాల్చిన తొలి నాళ్లలో ఈ మాత్ర వేసుకున్నా… పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మాత్రల వాడకం ఆపేసిన వెంటనే గర్భ ధారణ జరుగుతుంది. కాబట్టి.. అవసరం ఉన్నంత కాలం వేటిని నిరభ్యంతరంగా వాడవచ్చు. గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువ. నెలసరి మద్యలో రక్త స్రావం కూడా కనిపించే వీలుంది. కాబట్టి మాత్రలు వేసుకోవడం మారిచిపోతే గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

Related posts