telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సెల్‌ఫోన్‌ను బాత్రూంకి తీసుకుపోతున్నారా !

ప్రస్తుత కాలంలో మొబైల్‌ ఫోన్‌ అందరికీ కామన్‌ అయిపోయింది. చిన్న నుంచి ముసలి వాళ్ల వరకు అందరి దగ్గర టచ్‌ మొబైల్స్‌ ఉంటున్నాయి. అన్నం తినడం మర్చిపోయినా సరే కానీ.. మొబైల్‌ ఫోన్‌ను మాత్రం జేబులో పెట్టుకుని తిరుగుతారు. ఎక్కడికి వెళ్లినా… ఆ మొబైల్‌ ఉండాల్సిందే.. లేకపోతే.. మనసుకు ఎదో మరిచిపోయిన ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఇలా కొందరు ప్రశాంతంగా ఉండే.. బాత్రూం లోకి కూడా మొబైల్‌ ను తీసుకుపోతున్నారు. అయితే.. మొబైల్‌ ఫోన్‌తో బాత్రూంకు తీసుకెళ్లే అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మీరు లేక మీ కుటుంబ సభ్యులు టాయిలెట్‌ నుంచి ప్రమాదకర బ్యాక్టీరియాను ఇంట్లోకి తెస్తారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అసలే కరోనా వైరస్‌ లాంటి వ్యాధులు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే పైల్స్‌ సమస్య ఇప్పుడు యువతో కూడా సాధరణమైంది. పైల్స్‌ సమస్య కారణంగా మీ మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం చేస్తుంటారు. అయితే మీరు మొబైల్‌తో బాత్రూమ్‌లో కూర్చున్నప్పుడు, ఫోన్‌పైన మీ పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఈ కారణంగా మీరు సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల హేమోరాయిడ్స్‌ అంటే పైల్స్‌ వచ్చే ప్రమాదం పెంచుతుంది. కాబట్టి ఇకనైనా మొబైల్‌ ఫోన్‌ను టాయిలెట్‌లోకి తీసుకువెళ్లకండి.

Related posts