telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఆ అలవాట్లతో గుండెకు ముప్పే..!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనమే ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా చేసేస్తాము. అదే మన ఆరోగ్యమే దెబ్బ తింటే… ఇక మన జీవనం కష్టమే అవుతుంది. అయితే.. ఆరోగ్యం అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా గుండె జబ్బులు టక్కున గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం జనరేషన్‌లో.. పని ఒత్తిడి, టెన్షన్‌, ఇంట్లో సమస్యలు ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. అలాగే మనం తినే తిండి, టైమింగ్స్‌ వల్ల కూడా ఈ గుండె జబ్బులు వస్తున్నాయి.

ఉదయం టిఫిన్‌ చేయకపోయినా… రాత్రి ఆలస్యంగా భోజంన చేసినా గుండె పోటు తప్పదని డాక్టర్లు, తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్యలో 2 గంటల సమయం ఉండాలనేది సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం టిఫిన్‌ చేయకపోతే 58 శాతం, రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51 శాతం ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు ప్రివెంటివ్ కార్డియాలజీ అనే ఐరోపా జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది.

Related posts