telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ వంటింటి చిట్కాలు పాటించి.. కరోనాకు చెక్ పెట్టండి!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. మన దేశంలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది . కొత్త కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి . భారత్ లో కొత్తగా 2,61,500 కేసులు నమోదయ్యాయి . గడిచిన 24 గంటల్లో 1,501 మంది మృత్యువాత పడ్డారు . దేశంలో మొత్తం కరోనా కేసులు 1.45 కోట్లు దాటాయి . మొత్తం మరణాలు 1,75,649 కి చేరాయి . ఇక యాక్టివ్ కేసులు 18,01,316 ఉన్నాయి . 1.28 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి వంటకాల్లో పసుపు , జీలకర్ర , ధనియాలు , వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి . – 150 మిల్లీలీటర్ల పాలలో అర స్పూన్ పసుపు కలుపుకొని రోజుకు 1 లేదా 2 సార్లు తాగండి . – టేబుల్ స్పూన్ నువ్వుల / కొబ్బరి నూనె నోట్లో వేసుకుని పుక్కిలించాలి . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . – రోజూ కనీసం అరగంట యోగ , ప్రాణాయామం , ధ్యానం చేయాలి . గోరువెచ్చని నీరు తాగాలి . – పాలు , పెరుగు , పుట్టగొడుగులు , గుడ్లు తీసుకోండి.

Related posts