telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. 16 నియమాలు పాటించండి !

People queue standing in circles drawn to maintain safe distance as they wait to buy grocery items during a 21-day nationwide lockdown to limit the spreading of Coronavirus disease (COVID-19), in Kolkata

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.29 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.  అయితే.. కరోనా నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అందరూ అనుకుంటున్నారు.  కింది సూచనలు పాటించడం వల్ల కోవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు.

1. రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా మీద లేదా ఇంటిబయట ఎండలో 20 ని. నుండి 40 ని. వరకు శ్వాస వ్యాయామాలు మరియు యోగ తప్పనిసరిగా
చేయండి.

2. ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి…అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలా సార్లు 5 లీటర్ల వరకు త్రాగండి…

3. ఆయుర్వేదం లో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు మొదలైనవి( ఇదివరకే కాషాయం పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి) నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.

4. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాల లో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి.

5. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి తేలికగా కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఇంట్లో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి చేయండి మరియు పాటించండి.

6. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి బలమైన ఆహారం అయిన కోడిగుడ్డు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ ఎక్కువుగా తినండి. మరియు రాగి జావ తీసుకోండి.

7. బిపి, షుగర్ వంటి అత్యవసరమైన మందులు తో పాటు ఇంట్లో తప్పనిసరిగా 1. పారాసెటమాల్, 2.సిట్రేజిన్, 3.దగ్గు మాత్రలు,
4.మౌత్ వాష్ మరియు గార్గిల్ కోసం బీటాడిన్, 5.విటమిన్ సి మరియు డి 3, 6.బి కాంప్లెక్స్ జింకోవిట్, 7. ఆవిరి కోసం జండూ బామ్ మరియు
పసుపు ఉంచుకోండి.

8.ఆఫీసులు, ఉద్యోగ ప్రాంతం, రద్దీ ప్రాంతాల్లో నుండి ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే మీ మొబైల్, తాళాలు, పర్సులను శానిటైజర్ తో శుభ్రము చేసి, బట్టలను బయటే విడచి డెట్టాల్ కలిపిన నీళ్ళలో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి.

9. బయట నుండి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.

10. ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.

11. బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకరాదు.

12. ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి.

13. రోగనిరోధక శక్తి ని పెంచే సీ విటమిన్ ఎక్కువుగా గల పండ్లు నిమ్మ, జామ, ఉసిరి తో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ మొదలైనవి తరచుగా తీసుకోవాలి.

14. రోజు రాత్రి సమయం లో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి.

15. ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోండి.

16. ఈ పరిస్థితుల్లో మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Related posts