telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వంటింటి చిట్కాలతో.. ఇలా కరోనాకు పెట్టండి !

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా మొదటి దశలో చూడని ఉత్పాతాలెన్నో రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. గతంలో కంటే వ్యాధి వ్యాప్తి వేగం, తీవ్రత పెరిగాయి. ఈ కరోన ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికి తెలియడం లేదు.   అయితే వంటింట్లోనే రోగ నిరోధక శక్తిని పెంచుకుని కరోనాను దూరం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.  

మందులు, వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ వస్తుందన్నది ఎంత వాస్తవమో.. మంచి ఆహారంతో కూడా పెంచుకోవచ్చనేది అక్షర సత్యం. మరి దివ్యౌషధం లాంటి ఆహారంలో ఏమేమి ఉండాలి..? ధనియాలు, ఆవాలు ఎక్కువగా తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటి? 

* పోపుల పెట్టెలో ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, సెనగపప్పు, మిరియాలు, మిరపకాయ తదితర సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. చింతపండు రసం, మసాలాలు అతిగా వాడకుండా ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది.

* వాము, ఆవాల పొడి, మెంతులు, ధనియాల పొడిని తరచూ వినియోగించడం వల్ల జీర్ణశక్తి, ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పనికొస్తాయి.

 

* కరోనా అన్ని లక్షణాలపైనా అడ్డసరం మూలిక బాగా పని చేస్తుంది.

 

* పాలలో అశ్వగంధ చూర్ణం వేసుకుని తాగడం చాలా మంచిది. తులసితో జలుబు, దగ్గు, కఫం మటుమాయవుతాయి.

 

* పుదీనాలోని ఔషధ గుణాలతో జీర్ణకోశం సురక్షితంగా ఉంటుంది. జీర్ణశక్తిని పాడు చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. 

 

* కరోనా వల్ల ఊపిరితిత్తులకు వచ్చే లక్షణాలపై వాసరిష్ట, దసములారిష్ట, కనకాసనం, ద్రాక్షరిష్ట మందులు చాలా బాగా పనిచేస్తాయి.

 

* సుదర్శన (నేలవాము) అనే మొక్క యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియాగా అద్భుతంగా పని చేస్తుంది. కరోనా కాలంలో మజ్జిగ, పెరుగు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిమితంగా అల్లం, వెల్లుల్లి వాడుకోవాలి.

 

* అల్లం, సైంధవ లవణం కలిపి నూరిన మిశ్రమాన్ని భోజనంలో మొదటి ముద్దగా తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

 

* వేడిపాలల్లో పసుపు, బెల్లం తాగాలి. నీళ్లల్లో వాము, ధనియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి బాగుంటుంది.

 

 

Related posts