telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉదయాన్నే లేవలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి !

simple technique to go sleep quickly

ఉదయాన్నే లేవాలంటే ఎవరు ఇష్ట పడరు చాలా మంది. కానీ లేవాలి అని అంతకు ముందు రోజు రాత్రి ప్రీపేర్ అవుతారు. మార్నింగ్ అలారం మోగగానే.. దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడకేస్తారు. అయితే అలాంటి వాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తే ఉదయాన్నే లేస్తారు. 

ఉదయాన్నే లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర పోయినప్పుడే శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది.
రాత్రి నిద్రపోయే అరగంట ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే బ్ల్యూ లైట్ వల్ల నిద్ర చెడిపోతుంది.
రాత్రిళ్ళు ఆలస్యంగా తినకూడదు. దాని వల్ల యాసిడ్ రిప్లక్స్ వంటి సమస్యలు వచ్చి నిద్ర పట్టదు.
నిద్రపోయే ముందు కాఫీ, టీ లు తీసుకోకూడదు.
కిటికీలకు ఉన్న పరాదలను పూర్తిగా మూసేయకూడదు. ఉదయాన్నే వెలుతురు పడేలా కర్టెన్లు కాస్త తెరిచిఊ ఉంచాలి.
స్మార్ట్ ఫోన్ లో అలారం పెట్టుకోవడం, మోగగానే ఆపేసి కొందరు పడుకుంటారు. అలా కాకుండా టేబల్ వాచ్ లో అలారం సెట్ చేసి బెడ్ కు దూరంగా పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సూర్యోదయం కన్నా ముందే లేస్తారు.

Related posts