telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

 వర్క్‌ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!

పేద వారి నుంచి ధనికుల వరకు అందరిని కరోనా మహమ్మారి ఇంటికే పరిమితం చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. మన దేశంలో ఈ లాక్ డౌన్ కొనసాగింది. అయితే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ముక్యంగా వర్క్ ఫ్రొం హోమ్ చేసేవారు ఇలా చేయాలనీ డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారు మధ్యలో బ్రేక్‌ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని స్ట్రచ్‌ చేయాలని తెలిపింది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వర్క్‌ ఫ్రం హోం చేసే వాళ్ళు యూట్యూబ్‌, టీవీల్లో వ్యాయామ కార్యక్రమాలు చూసి…వాటిని చేయాలనీ కూడా పేర్కొంది. అంతేకాదు డాన్స్‌ చేయడం, యాక్టివ్‌ వీడియో గేమ్‌లు ఆడటం, మజిల్‌ స్ట్రన్త్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేయాలనీ తెలిపింది.

Related posts