telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చర్మం ముడతలు పడకుండా వుండాలంటే..

ప్రతి ఒక్కరూ తామే అందంగా ఉండాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే అందంగా తయారు కావడానికి ఎన్నో క్రిమ్స్‌ ఇంకా చాలా వాడుతారు. కానీ వాటి వల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటాయి. అయితే.. మనకు నిత్యం కనిపించే బాదం వల్ల మన చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

1. చర్మం ముడతలు పడకుండా వుండాలంటే.. బాదంను తప్పక తీసుకోవాలి. 
2. వీలైనప్పుడల్లా బాదం పప్పును నోట్లో వేసుకోండి.
3. ఇది చర్మం ముడతల సైజు, తీవ్రత తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజా సర్వేలో తేలింది.
4. అలాగూ నెలసరి నిలిచిపోయిన మహిళల్లో కొందరికి రోజువారీ ఆహారంలో కొద్దిగా బాదం పప్పు ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు.
5. బాదం పప్పు తినని వారితో పోలిస్తే.. తిన్నవారిలో ముడతల సైజు పదిశాతం వరకు తగ్గిందని ఆ అధ్యయనంలో తేలింది. బాదం పప్పులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒక్క చర్మ ఆరోగ్యానికే కాదు, క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యల నివారణకూ తోడ్పడతాయి.
6. అందుకే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారినపడకుండా కాపాడుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Related posts