telugu navyamedia
health news trending

కొబ్బరినూనె, తేనె అద్భుత లాభాలు !

నోటిపూత తగ్గేందుకు పవర్‌ఫుల్ చిట్కాలు..!
1. తేనె
కొద్దిగా తేనెను తీసుకుని నోట్లో పుండ్లు ఉన్న చోట్ల ఐప్లె చేయాలి. ఆ తరువాత 30 నిమిషాల వరకు అలాగే ఉండాలి. ఏ ఆహారం గానీ, ద్రవాలు గానీ తీసుకోరాదు. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే నోటి పూత సమస్య నుంచి బయట పడవచ్చు. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు నోటి పూతను తగ్గిస్తాయి.
2. కొబ్బరినూనె
కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి నోట్లో ఏర్పడే పుండ్లను తగ్గిస్తాయి. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని పుండ్లపై రాయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నోటి పూత నుంచి విముక్తి కలుగుతుంది.
3. యాపిల్ సైడర్ వెనిగర్
అర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా పుక్కిలించాలి. అనంతరం ఆ నీటిని ఉమ్మేయాలి. ఇలా రోజులో కనీసం 3 సార్లు చేసినా చాలు నోటి పూత సమస్య నుంచి బయట పడవచ్చు.
4. ఉప్పు నీరు
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. ఇలా రోజూ చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. ఆరెంజ్ జ్యూస్
రోజూ రెండు గ్లాస్‌ల ఆరెంజ్ జ్యూస్ తాగాలి. ఇలా నోటి పూత తగ్గే వరకు తాగవచ్చు. దీంతో ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది నోటి పూతను తగ్గిస్తుంది.
6. వెల్లుల్లి
సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నందున నోటిపూత ఇట్టే తగ్గిపోతుంది. అందుకు ఏం చేయాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని బాగా నలిపి వాటిని పుండ్లపై రాయాలి. ఇలా రోజుకు కనీసం 3, 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Related posts

చిరంజీవి “ఆచార్య”లో బిగ్‌బాస్‌ స్టార్‌..?

Vasishta Reddy

అమీ జాక్సన్ బేబీ షవర్ పార్టీ… ఫోటోలు వైరల్

vimala p

డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్.. ముగ్గురు దుర్మరణం

vimala p