telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అరటిపండును, మిరియాలతో అద్దుకొని తింటే..ఈ సమస్యలు దగ్గరికీ కూడా రావు

Banana

ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కాదు . ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకి రెండు సార్లు మలవిసర్జన చేయవలెను అని ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా ఉంది.

– మలబద్దకం అనేది మానవ శరీరంలో వ్యాధులు ప్రారంభం అవుటకు మొదటి మెట్టు . మలబద్దకం ప్రారంభం అయిన వెంటనే గ్యాస్ సమస్య కూడా మొదలు అవుతుంది. కావున మలబద్ధకం అనే సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలెను.

* మిరియాలను నూరి చూర్ణం చేసి అరటిపండుతో అద్దుకొని భుజిస్తే మలబద్దకం తగ్గును. చిటికెడు మిరియాల చూర్ణం చాలు .

* తెల్ల తెగడ ఆయుర్వేద షాపుల్లో దొరకును . దానిని పాలల్లో ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి అణా ఎత్తు చూర్ణాన్ని అనుదినం సేవిస్తున్న యెడల మలబద్దకం పోతుంది .

* మాచిపత్ర ఆకుల కషాయం తాగుతున్న మలబద్దకం నివారణ అగును.

* సీతాఫలం వేరు నూరి ఆ రసాన్ని తీసి తాగిన సుఖవిరేచనం అగును.

* కాకరకాయ కూర భోజనంలో కొంచంగా తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.

* ఎండిన ఎర్ర రేగిపళ్ళు గాని , వాటి వడియాలు గాని తింటూ ఉంటే సుఖవిరేచనం అగును.

* ప్రతిపూటా కొంచం చింతపండు తింటూ ఉన్నా సుఖవిరేచనం అగును. ఎక్కువ తినినచో విరేచనాలు అగును. అందుకే మలబద్దకం లేకుండా ఉండుటకు రోజూ చాలా మంది భోజనంతో చింతపండు చారు కప్పుడు తాగుతారు.

* బాగుగా మిగుల పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తినినచో సుఖవిరేచనం అగును. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గును.

* నాగజెముడు , ఆకుజెముడు , బొంతజెముడు వీటిలో ఏ రకమైన జెముడు రసం పది చుక్కలు తీసుకుంటే విరేచనాలు అవుతాయి . అయిదు చుక్కల మోతాదు సరిపోతుంది.

* ఇంగువ కుంకుడు గింజ అంత లొపలికి తీసుకున్నచో కడుపులో ఉన్న మలం అంతా బయటకి వెళ్లి కడుపు శుభ్రం అగును.

* సునాముఖి చూర్ణం ఒక చెంచా మోతాదు నిద్రకు ఉపక్రమించబోయే సమయాన ఒక గ్లాస్ గొరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నచో ఉదయానికి సుఖవిరేచనం అయ్యి వ్యర్థాలు బయటకి వెళ్లును.

#గ్యాస్ట్రబుల్అడ్డుకోవడమెలా..?నవీన్ ఆయుర్వేదం సలహాలు

కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, గ్యాస్,బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి.

1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.

2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.

3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

4. టీ, కాఫీలు మానేయాలి.

5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.

6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.

7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.

#సమస్యనుఅడ్డుకునేందుకుఏంచేయాలినవీన్_సలహాలు ?

* శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది.

* ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.

* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది

Related posts