telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

హిమోగ్లోబిన్‌ తగ్గిపోయిందా… అయితే ఇలా చేయండి

హిమోగ్లోబిన్‌ లోపం వల్ల రక్త హీనత ఏర్పడుతుంటుంది. దీంతో విపరీతమైన నీరసం వస్తుంటుంది. దీన్ని అధిగమించాలంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుకోవాలి. దీనికి డాక్టరు దగ్గరికి వెళితే వివిధరకాలైన మందులు, టానిక్‌లు వాడమని సూచిస్తారు. అలాకాకుండా మన ఆహారంలోనే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చక్కగా ఆహారంతోబాటు మన రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరగడానికి అవసరమైన పదార్ధాలను తీసుకోవడం సులభమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గడానికి కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడం, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు రావడం, పొట్టలో పురుగులు ఉండడం, ఎముక మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో లేకపోవడం ఇలా చాలా కారణాల వల్ల హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటుంది.
రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరగడానికి మన ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో మొదటిది ఉదయాన్నే టిఫినుతోబాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవాలి. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి. ఇక భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర ఉండేలా చూడాలి. నిద్రపోయేముందు ఒక గుప్పెడు వేరుశెనగ పప్పులు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకుంటే చాలు. మన రక్తంలో కావలసిన పరిమాణంలో హిమోగ్లోబిన్‌ సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related posts