telugu navyamedia
health news trending

షుగర్ ఉంటే సెక్స్ సమస్యలు…అయితే ఈ నియమాలు పాటించండి !

ప్రస్తుతం కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

#మధుమేహావ్యాధిగ్రస్తులతోలైంగికసామర్థ్యంతగ్గకుండఉండాలంటే…

మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి.కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి.యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది.

 తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

#చికిత్స

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తి వంతమైన ఔషాధాలెన్నో హోమియో వైద్యంలో కలవు. వ్యక్తి యెక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకుని వైద్యం చేసినవో లైంగిక సమస్యలును త్వరితంగా నివారించవచ్చును.

#మందులు_హోమియో

#ఆసిడ్_ఫాన్‌

వీరికి నీరసం, నిస్త్రాణ ఎక్కువ.శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పని చేయును. అలాగే అంగము పూర్తిగా చెందక ముందే గాని, లేదా అంగప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతు, మధుమేహాంతో బాధపడేవారికి ఈ మందువాడి ప్రయోజనం పొందవచ్చును.

#ఫాస్పరస్‌

వీరికి లైంగిక వాంఛ అధికం, కానీ సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించి దగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

#లైకోపోడియం

ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికి ముఖ్యమైనది. అతిగా కామకాలాపాల్లో పాల్గొనడం వల్ల , హస్త ప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పొయిన వారికి ఈ మందు చాలా ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం అహాం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లు నుదిటిపై ముడతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఙతలు తెలిపితే వెంటనే కంటతడి పెడుతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే వారు లైంగిక సామర్ధ్యం కొరకు ఆ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

#ఎగ్నన్‌_కాక్టన్‌

వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంచ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరుచుగా జరుగును. వీరికి సంభోగ వాంచ కూడా ఉండకపోవుట గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న మధుమేహా వ్యాధి గ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

#అవైనా_సటైవా

నిత్యం మద్యం సేవిస్తూ, సరైనా నిద్రలేక నరాల బలిహీనత ఏర్పడి సంభోగ శక్తిని కోల్పోయిన డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

#సెలీనియం

మానసికంగా కామ వాంఛ కొరిక ఉన్నా శారీరక అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారకి ఈ మందు అలోచించదగినది.ఈ మందులే కాకుండా డామియాన, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ గారి సలహా మేరకు వాడి మధుమేహాంలో ఎదుర్కునే లైంగిక సమస్యలనుంచి విముక్తి పొందవచ్చును.

Related posts

పండుగ ఆఫర్.. ఎంత బంగారం కొంటె అంత ఉచితం.. : మొబీక్విక్

vimala p

మహిళలకు షాక్…మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

Vasishta Reddy

దగ్గుకు.. ఇంటి చిట్కాలు..

vimala p