telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇలా నడిస్తే… షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు !

ప్రతిరోజూ భోజంన చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ భారీ తగ్గుతాయని కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం ఎక్కువగా రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. దీనివల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రి పూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే.. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఇలా ఉంటే… మరో రకమైన డయాబెటిస్‌ పెషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాల పాటు నడవాలని సూచించారు. వారి బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ కొలిచారు. రాత్రిపూట భోజనం తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్‌ పెషెంట్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ 12 శాతం అధికంగా తగ్గిపోయాయి. ఇక రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గినట్లు రీసెర్చర్స్‌ వివరించారు. ఇలా వాకింగ్‌ చేస్తే.. మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి, మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు రిపోర్టులో తెలిపారు.

Related posts