telugu navyamedia
ఆరోగ్యం

బొప్పాయితో హెల్త్‌ సీక్రెట్స్‌..!

బొప్పాయి రుచిగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంవత్సరమంతా ఆ సీజ‌న్‌ల్లో దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి. రుతుక్ర‌మ స‌మ‌స్య‌లుతో బాధ‌ప‌డేవారికి ఇది మంచి ఔష‌దం.

హార్ట్ ఎటాక్‌, హైబిపి, స్టోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల‌కు బొబ్బాయి బాగా ప‌నిచేస్తుంది. అంతాకాకుండా ఇందులో ఉండే పీచుప‌దార్ధం కొల‌స్ర్టాల్ స్థాయిని త‌గ్గిస్తుంది. న‌రాల బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి ఇది ఒక మంచి టానిక్‌.

Top Benefits Of Papaya | Dietician Priyanka Mittal | Papaya Benefits

అరుగుదల సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులోని ప్లేవనాయిడ్స్‌ అనే ఎంజైమ్‌ అరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బొప్పాయిలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లి.. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఎడిమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవాలి.

ఇందులోని ఎ, సీ విటమిన్లు, కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం కూడా తగ్గుతుంది.బొప్పాయి ముక్కలను పాలతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలా చేస్తే బాలింతల్లో పాలు పడతాయి.Indian Papaya Diced into Pieces - Vedic Indian Supermarket

1.బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
2. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
3. మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
4.బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు
5. కాన్సర్‌‌పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లనుకూడా తగ్గిస్తుంది.

అయితే బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా రోజూ తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

Related posts