telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

పోపుల పెట్టెలో.. ఎన్నో ఆరోగ్య రహస్యాలు…

health secrets in indian spice box

వాతావరణం మారుతున్నప్పుడల్లా ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది, దానికి పరిష్కారం కూడా ఆయా సీజన్ లలో దొరికే ఆహారంలోనే ఉందని అందరికి తెలిసినవిషయమే. అయితే, ఈ అనారోగ్యాలు తలెత్తకుండా మన ఇంటిలోని పోపుల పెట్టెలో ఉండే వాటిని రోజు తీసుకుంటే సరిపోతుందని ఎందరికి తెలుసు. సాధారణంగా, చలికాలంలో తరుచూ జలుబు, దగ్గు వస్తుండటం మనం చూస్తుంటాం. శరీరం బద్దకించడం, జీర్ణవ్యవస్థ మందగించడం, నీరసంగా అనిపించడం..ఇలా పలు రకాల అస్వస్తతలకు లోనైతే వంటింటి సామగ్రితోనే వైద్యం చేసుకోవచ్చని చెబుతున్నారు ప్రకృతి వైద్యులు. తరుచూ వైద్యులను ఆశ్రయించకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. మనం రోజు ఉపయోగించే పోపు దినుసులే మందుగా పనిచేస్తాయని, సీజనల్ వ్యాధులకు అడ్డుకట్టు వేయవచ్చని సుస్పష్టంగా చెపుతున్నారు. అది ఎలా, ఏమిటో చూద్దాం..

ఎల్లిపాయ :

చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోకుండా సడలింపజేసేందుకు ఎల్లిపాయలు ఎంతో ఉపయోగపడతా యి. తగిన మోతాదులో ఆహారంలో వీటిని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుందనీ, కాస్త వేడి నిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

యాలకులు :

సైనస్, దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహద పడతాయి. చలికాలంలో వాతావరణ మార్పులు కారణంగా శరీరం బద్దకించడం మాములుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో గ్లాసు నీటిలో రెండు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగితే ఉత్జేంగా ఉంటుంది. దీనికి కొంచేం తేనె కలిపి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

health secrets in indian spice boxjబెల్లం :

అజీర్తితో బాధపడుతున్నారా.. భోజనం చేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. వానాకాలం, శీతాకాలం తరుచూ ఇబ్బంది పెట్టే జలుబు ఉపశమనం కోసం అల్లం పాడిలో బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదే గొంతు గరగర ఉన్నా జీర్ణవ్యవస్థ్ధ మందగించినా శొంఠి పొడిలో బెల్లం కలిపి తింటే మెరగవుతుంది.

పసుపు :

ఎవరైనా గాయం తగిలి రక్తం కారుతున్నదంటే ముందుగా గుర్తొచ్చేది పసుపే, తగిలిన చోట కొంచెం రాస్తే గడ్డకట్టుకుపోతుంది. చిన్న చిన్న గాయాలైతే ఎలాంటి మందుల వాడకపోయినా దీంతో నయమైపోతుంది. ఎన్నో ఔషద గుణాలున్న పసుపు రోగ నిరోధక శక్తి పెంపొందుటకు తోడ్పడుతుంది. జలుబు,దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఫలితముంటుంది. తేనెలో కలిపి తీసుకున్నా ఉపశమనం కలుగుతుంది.

చెక్క :

బిర్యానీ, బగారా తయారీలో దాల్చిన చెక్కను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ చెక్క మంచి వాసనకే కాదు, ఔషధ గుణాలూ ఎక్కు వగానే ఉన్నాయి. మధుమేహం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరిచేందుకు, నీరసాన్ని దూరం చేసేందుకు పనిచేస్తుంది. చిన్నపాటి ముక్కను నోట్లో వేసుకొని మెల్లగా నమిలితే నోటి దుర్వాసన పోవడమా కాదు. శరీరం చురుగ్గా కదులుతుంది.

అల్లం :

కూరలు ముఖ్యంగా మాంసాహారం రుచిగా ఉండేందుకు అల్లం, ఎల్లిపాయ మిశ్రమాన్ని ఎక్కువగా వాడుతుండడం మనం చూస్తుంటాం. అవి రుచిగా ఉండేందుకు మాత్రమే కాదు, అవి త్వరగా అరగడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. అల్లం ముక్క రోజు ఒకటి తీసుకుంటే, జీర్ణసంబంధ సమస్యలు, పైత్యం లాంటివి దరిచేరవు.

Related posts