telugu navyamedia
health Sexual Problems

చనువుగా ఉంటే అనుమానమా ?

Participating in sex for seven hours a day .... She is dissatisfied

మా పెళ్త్లె పదిహేనేళ్లు అవుతోంది. నేను బాగా చదువుకున్నాను. ఓ పార్టీలో ఓ ధనవంతుడు పరిచయమయ్యాడు. అప్పట్నుంచి అతనితో చనువుగా ఉంటున్నాను. కానీ ఏనాడూ హద్దులు దాటలేదు. ఈ మధ్యే తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమంటూ ఆయన ప్రతిపాదన తెచ్చాడు. అదే నా భర్తకు తెలిపి అతన్ని పరిచయం చేశా. అప్పట్నుంచి ఆయనలో చెప్పలేనంత పరధ్యానం. నా వల్ల కుటుంబానికి ఏదైనా లోటు జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఏడ్చేస్తారు. కొన్నాళ్లుగా లైంగిక చర్యకు దూరంగా ఉన్నాం. మేమిద్దరం దగ్గరగానే ఉంటున్నా మనసులో ఏదో అగాధం. ఇప్పుడేమో రోజూ కలయికలో పాల్గొనాలని ఉందంటున్నారు. ఆ స్నేహితుడిని ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఆయనలో వచ్చిన మార్పుతో కుంగిపోతున్నా.

కుటుంబంలో భార్య బాగా చదువుకోవడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలనని నిరూపించడం, మరొకరితో కలిసి పని చేయాలని నిర్ణయించుకోవడం వల్ల భర్త సహజంగానే కొంత అభద్రతకు లోనవుతాడు. అదే సమయంలో భార్య పట్ల అనుమానం కూడా మొదలవుతుంది. ఈ పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో మీ భర్త కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చారు. అయినా జీవితానికి సంబంధించి మీకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. ఇప్పుడు మీ మధ్య సమస్యలు పెరగడానికి అదే కారణం. మీరు మీ స్నేహితుడితో హద్దులు దాటకపోయినా భర్త మిమ్మల్ని అనుమానిస్తున్నాడంటే.. మీ స్నేహితుడు నిర్వహించే వ్యాపారంలో మీరొక్కరే కాకుండా.. భర్తనూ భాగస్వామిని చేయండి. మీ స్నేహితుడితో మీకెలాంటి శారీరక సంబంధం లేదని మీ భర్త తెలుసుకునేలా నిరూపించండి. మీరు మీ భర్తతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడే మీ బంధం ధృడమవుతుంది. కుటుంబం తరవాతే మిగతావన్నీ.

Related posts

దాంపత్యంలో అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే… 

ashok

టమాటతో .. లివర్ ఆరోగ్యం.. !

vimala p

పొట్టదగ్గర కొవ్వుకు..చెక్ పెట్టెయ్ ఇలా…

vimala p