telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉప్పు వాడుతున్నారా.. అయితే ఈ సంచలన విషయాలు తెలుసుకోండి

సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.

Related posts