telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అల్లం తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

లాక్ డౌన్ పుణ్యమంటూ ప్రజలందరూ తమ ఆరోగ్యాలపై ద్రుష్టి పెట్టారు. అందరు ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. అయితే..మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే అల్లం తో కూడా అద్భుత ప్రయోజనాలున్నాయి. అల్లం చాలా ఘాటుగా, రుచిగా ఉంటుంది. మన వంటకాల్లో సర్వసాధారణంగా వాడుతాం. అయితే ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయట. అల్లంలో జింజిరోల్, షోగాళ్, జింగిబేరన్ తో పాటు పెద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల సుదీర్ఘ ఔషధ చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం అన్ని రకాల రోగాలను నయం చేసేందుకు అల్లాన్ని వాడేవారు. అల్లంను క్రమం తప్పకుండ మన ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరం ఆరోగ్యాంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

అల్లం వల్ల ఉపయోగాలు :

అల్లం వల్ల వికారం, వాంతులు లాంటి లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. కీళ్ల వాపును తగ్గిస్తుంది. అల్లంలో షోగాళ్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అల్లంలోని జింగిబేరన్ వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Related posts