telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పసుపు కలిపిన పాలు తాగితే… శృంగార సమస్యలకు చెక్ !

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కు తీసి, ఎండ బెట్టి గృహస్థాయిలో తయారు చేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే పసుపు పాలు అనేది ఇప్పటి చిట్కా కాదు మన పూర్వికుల ఆరోగ్య రహస్యం. రోజూ క్రమం తప్పకుండా పసుపు పాలు తాగితే శరీరానికి బోలెడంత ఆరోగ్యం లభిస్తుంది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషద గుణాలు.. మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు పాలు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది.

పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి. ముఖ్యంగా శృంగార సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  కామెర్లు దరిచేరకుండా పసుపు పాలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది.

Related posts