telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చెరకు రసం తాగుతున్నారా… అయితే ఇవి తెలుసుకోండి !

చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే.. ఈ వేసవిలో త్వరగా నిరసించిపోతుంటారు చాలా మంది. అయితే.. వీటికి చెరకు రసంతో చెక్ పెట్టవచ్చు. 
చెరకు రసం ఈ వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది.
అదెలాగో చూద్దామా…!
* నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరించడమే అందుకు కారణం. అలసట కూడా దూరమవుతుంది.
* చెరకులో కాల్షియం ఉండటంతో అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది.
* పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు చెరకు రసంలో ఎక్కువ. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.
* కాలేయాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది.
* అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచడంలోనూ చెరకురసం అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో పీహెచ్‌ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం ఇందులో ఉండటంతో ఈ రసాన్ని తాగితే, అజీర్తికి దూరంగా ఉండవచ్చు.
* రొమ్ము కాన్సర్‌ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలాయి.
* గొంతునొప్పి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగాలి. ఇందులో ఉండే విటమిన్‌ సి వల్ల గొంతు నొప్పి మటుమాయమవుతుంది. అలాగే ఈ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి చర్మానికీ మేలుచేస్తాయి.
* శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే ఈ రసం శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగించగలదు.

Related posts