telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గులాబీ టీ తాగితే…. పురుషులు,మహిళల్లో ఇక ఆ సమస్య ఫినిష్ !

“టీ” అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అన్నం లేకుండా ఉంటారేమో కానీ… టీ తాగకుండా ఉండలేరు. ఎలాంటి టెన్షన్‌ వచ్చినా.. ముందుగా టీ తాగేస్తారు. అయితే.. ఈ టీ లలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ టీ తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి గులాబీ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. ఒక కప్పు నీటిని గులాబీ రేకులను వేసి బాగా మరిగించాలి. సుమారుగా 20 నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి కొంచెం తేనే, నిమ్మరసం కలుపుకుని త్రాగాలి. ప్రతి రోజూ గులాబీ టీ త్రాగటం వల్ల చర్మం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. గులాబీ టీలో యాంటీ బయోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా రావటమే కాకుండా ఆ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తి పెరిగి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. గులాబీ టీని ప్రతి రోజూ త్రాగుతూ ఉంటే… ఒత్తిడి, ఆందోళన దూరం అయి.. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Related posts