telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎర్రటి అరటి పండు తింటే అసలు డాక్టర్ అవసరమే లేదు !

అరటి పండు ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. పచ్చి అరటికాయలను కూరలుగా వాడుకుని తింటూ ఉంటాము.  అందరూ ఎక్కువగా సాధారణ అరటి పండ్లే తింటారు కానీ దాని కంటే పవర్‌ ఫుల్‌ ఎర్రటి అరటి పండు. ఈ విషయం ఎవరికీ తెలియదు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం

ఎర్రటి అరటి పండులో మాములు అరటి పండు కంటే ఎక్కువ బీటా కెరోటిన్‌ కలిగి ఉంటుందట. బీటా కెరోటిన్‌ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎరుపు రంగు అరటి పండు తినటం వల్ల క్యాన్సర్‌, గుండె జబ్బులను కూడా దరిచేరనీయదు. అలాగే ఈ అరటి తినడం వల్ల చెస్ట్‌ అలర్జీని తగ్గిస్తుంది.
ఎర్ర అరటి పండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో అతిగా తినడం మానేస్తాం. అంతిమంగా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
రక్తహీనతను తగ్గించడంలో ఎర్ర అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
ఎర్ర అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక ఎర్ర అరటి పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

Related posts