telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

గుమ్మడి కాయతో.. ఆ సమస్యకు చెక్

గుమ్మడి కాయను తరుచూ తినేవారు చాలా తక్కువే. పిల్లలు, టీనేజర్లయితే వాటి జోలికే పోరు. కానీ గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనితో కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచ్చు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అలాగే అందులో పొటాషియం అధికర రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకు తల్లి కావాలనుకునేవారు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వడియాలు చేసుకుని వేపుకుని తినేకన్నా… కూరగా తింటేనే మంచి ఫలితం ఉంటుంది. గుమ్మడి గింజలు తిన్నా చాలా మంచిది. హార్లోన్ల అసమతుల్యతను తగ్గించడం ఇది సహకరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా చూస్తుంది. గుమ్మడి గింజలు తింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Related posts