telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వేరుశనగ తింటున‌్నారా… అయితే ఇవి తెలుసుకోండి

పల్లికాయ.. వేరుశనగ.. పేరు ఏదైనా దీన్ని రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని చాలామంది వీటిని తినరు. కానీ అదంతా అపోహేనని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని తింటే లావు పెరిగిపోతారని, కొవ్వు పేరుకుపోతుందని, గుండె జబ్బులు వస్తాయని చాలామంది వీటిని తినేందుకు భయపడతారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదట. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడకబెట్టి, వేయించుకుని, పచ్చడి, కూరలు చేసుకుని తినొచ్చు. ఎలా తిన్నా పల్లీలతో మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. 

  • పల్లీలను తినడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. 
    ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. 
    ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని పరిశోధనల్లో తేలింది.
    ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. 
    రోగ నిరోధకశక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. 
    వీటిని తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 
    గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు.  
    ఉడికించిన పల్లీల్లో డ్రైఫ్రూట్స్‌తో సమానంగా పోషకాలుంటాయి. విటమిన్‌ ఇ, విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. ఎర్రరక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.
    ఉడికించిన పల్లీల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది.

Related posts