telugu navyamedia
health news trending

వేపాకుతో ఎన్ని ప్రయోజనాలా తెలుసా….100 రోగాలకు ఔషధం..!

neem leaves benefits in rain season

మనకు ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు కూడా ఒక ఔషధ గుణంగా పనిచేస్తుంది. అందులో అతి ముఖ్య మైనది , అతి శ్రేష్ఠ మైనది వేప ఈ వేపను పలురకాలుగా తీసుకుంటారు. అలాగే భారత దేశంలో ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వేపచెట్టు ఉంటుంది. అప్పట్లో వేపచెట్టే ఒక రచ్చబండల ఉండేది. వేప చెట్టు గాలి మన శరీరానికి చాల మంచిది అలాగే వేపచెట్టు ఉండటం వలన క్రిమి కీటకాదులు ఇంట్లోకి ప్రవేశించలేవు. వేప చెట్టును అనేక ఆయుర్వేదిక మందులలో ఉపయోగిస్తారు. వేప చెట్టు ఉన్న భీమిలోపల కూడా సారవంతంగా ఉంటుంది. ఇక వేపచెట్టు బెరడు కాయలు చెట్టు కాండం ఆకులూ అన్ని కూడా అన్ని విధాలా మానవ సేవలో తరిస్తున్నాయి. వేప చెట్టు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
1. వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి, ఇవి బ్యాక్టీరియాను మీ దంతాలకు అంటుకోకుండా చేస్తుంది. వేప యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగురువాపును నివారించడానికి సహాయపడతాయి, తీవ్రమైన చిగుళ్ల వ్యాధితో వల్లే వచ్చే చిగుళ్ల రక్తస్రావం నీ తగ్గిస్తుంది.వేప నోటిలోని బ్యాక్టీరియా తగ్గించి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.పళ్ళు చిగుళ్ళు శుభ్రం చేయడానికి వేప పుల్లలు ఉపయోగిస్తారు. పంటి వ్యాధులు దరిచేరవు.
2. లేత వేప కొమ్మల తో పళ్లు తోమడం ఒక అలవాటుగా మార్చుకున్న వారికి నోటి దుర్వాసన, డయేరియా, చిగుళ్ల నుంచి రక్తం కారడం పూర్తిగా తగ్గుతుందిలేత వేపాకు చిగుర్లు నిత్యం కొంత తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రించవచ్చు.
3. వేప చిగుళ్లు ఉప్పు వేసి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి నిత్యం ఉదయం సాయంకాలం తీసుకుంటూంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. (హైబీపీ ఉన్నవాళ్లు దీనిని ఉపయోగించవద్దు).
4. వేపపువ్వు మధుమేహ వ్యాధికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.మెంతులు, లేత వేప ఆకులు రుబ్బి, ఆ రసం వడకట్టి కటిక చేదు గానే ఉన్నప్పటికీ రోజుకు రెండు పూటలా ఓ స్పూన్ చొప్పున తీసుకుంటూంటే మధుమేహం తగ్గుతుంది.
5. ఆకలి మందగించినపుడు, కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు, వేప చెట్టు బెరడు 60 గ్రా|| తీసుకుని 4 గ్లాసు నీళ్ళలో కలిపి ఉడికించి కషాయంగా చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా ఇగర కాచాలి. అంటే 3 గ్లాసుల నీళ్లు ఇగిరిపోవాలన్న మాట ! ఇప్పుడు దీనిని 4 భాగాలుగా విభజించి 4 రోజులుగా రోజుకు రెండు సార్లు ఇవ్వాలి. ఇలా తాగుతే ఆకలి పుడుతుంది కాలేయ వ్యాధులు మోటు మాయం అవుతాయి.
6. వివిధ అధ్యయనాల ప్రకారం, కడుపు మరియు పేగు పూతల నివారణకు వేప బెరడు సారం కనుగొనబడింది. బెరడు సారాన్ని 10 వారాలపాటు ప్రతిరోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల ఆచరణాత్మకంగా పూతల నయం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బెరడు మలేరియా మరియు అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.
7. లేత వేప బెరడు, ఆకులతో నూరి గాయాలు పై పూతగ వాడుకోవచ్చు.వేప బెరడు పొడిని రెండు చెంచాలు ఉదయం, రాత్రి గోరు వెచ్చని నీటితో సేవిస్తే మలేరియా తగ్గుతుంది.
8. వేప బెరడు ని కాల్చి మసి చేసి సీసాలో ఉంచి భద్రపరచుకోవాలి. రాశి కారే పుండు మీద ఆ మసి చల్లితే పుండ్లు మానుతాయి. రాసి తగ్గుతుంది.
9. వేప చెట్టు బెరడు చర్మ రోగ నివారిణి గా పనిచేస్తుంది. వేప బెరడు కషాయం లా కాచి, చల్లార్చిన ఉదయం సాయంత్రం (రెండు పూటలా) సేవిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి.ప్రేగుల్లో క్రిములుంటే, వేప చెట్టు బెరడు (పట్టా) మెత్తని చూర్ణం చేసి ఉదయం సాయంత్రం ఒక్క చెంచా చొప్పున వారం రోజులు తీసుకోవాలి.
10. వేపగింజల 10 గ్రా. శొంఠి 10 గ్రా, తులసి ఆకులు తీసుకుని కలిపి మెత్తగా నూరుకోవాలి. దీని మీద నల్ల మిరియాల పొడి కొంచెం చెల్లి తిరిగి ” నూరుకోవాలి. దీన్ని ఉదయం, సాయంత్రం సేవిస్తూంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.లేత వేపాకులు గ్లాసు నీటిలో అరగంట పాటు నానబెట్టి తర్వాత అరగంట పాటు మరగబెట్టాలి. ఇది చల్లారాక వడగట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
11. వేప పువ్వులు నూరి కట్టు కట్టడంతో కుష్టు, బొల్లి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు పోతాయి.
12. వేప పువ్వు బోదకాలు నివారణ బాగా ఉపకరిస్తుంది.
13. వేప పువ్వు నూనె/నెయ్యి లో వేయించాలి. దీనికి కొద్దిగా ఉప్పు, చిటికెడు మిరియాలు పొడి చేర్చి నిత్యం ఉదయం మధ్యాహ్నం తినే అన్నం మొదటి ముద్దు కలుపుకొని తినడం వల్ల ఉబ్బసం వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేప చెట్టు కాయలు ముగ్గినవి తినడం వలన కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి.
14. వేప చెట్టు ఆకులను వేడినీటిలో మరిగించి స్నానం చేయడం ద్వారా శరీరానికి ఉన్న అలర్జీలు అన్ని తొలగిపోతాయి.
15. వేపాకు కాషాయం తాగడం వలన మన శరీరం లో అనేక మార్పులు చోటుచేసుకుని జీవ క్రియ మెరుగుపడుతుంది. వేప చెట్టును అమ్మవారికి ప్రతి రూపంగా కూడా కొలుస్తారు.

Related posts

ప్రపంచ కప్ :.. ముక్కి మూలిగి గెలిచిన పాక్.. అయినా నిరాశే..

vimala p

జమ్మూకాశ్మీర్ లో .. మహారాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు.. మొదటి రాష్ట్రం కూడా..

vimala p

మోడీని పొగిడిన .. షీలా దీక్షిత్ .. !

vimala p