telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మల్లె పూలు పెట్టుకుంటున్నారా… అయితే ఇవి తెలుసుకోండి !

మల్లె పూలతో అనేక లాభాలు ఉన్నాయి. ఇది మహిళల కోసమే కాకుండా అనేక రోగాల నివారణకు సహాయపడుతుంది. మల్లెల్ని.. మెత్తాగా నూరి.. తడిబట్టపై చుట్టికళ్లపై పెట్టుకుంటే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, కళ్లూ మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. కళ్లు మంటగా ఉన్నా.. కంటిలో నొప్పి ఉన్నా సరే మల్లెల కషాయాన్ని వాడితే తగ్గుతుంది. మల్లెపూలు, దాని ఆకులతో కషాయం కాయాలి. ఈ కషాయన్ని వడగట్ట చల్లార్చిన తరువాత రెండు వంతుల కషాయంలో ఓ వంతు నువ్వుల నూనె, ఓ వంతు కొబ్బరినూనె, ఒక స్పూన్‌ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు తలకు మర్ధనా చేస్తే.. తలనొప్పి, ఇంకా మిగతా సమస్యలు తొలగిపోతాయి. అలాగే.. మానసిక వ్యాకులత, డిప్రెషన్‌, అతికోపం, మానసిక చంచలత్వాన్ని స్థిరపర్చి శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందంటున్నారు నిపుణులు. ఈ పూల వాసన రోజుకు పది సార్లు పీల్చితే.. మంచి నిద్ర కూడా పడుతుందట. అంతేకాదు..షుగర్‌తో బాధపడుతున్నవారు మల్లెపూల చాయ్‌ తాగితే.. దానికి చెక్‌ పెట్టవచ్చట. ఇక జట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. దీని కోసం కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టాలి. ఆ త్వరాత జట్టుకు రాసుకుంటే.. అద్భుత ఫలితాలు ఉంటాయట.

Related posts