telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఐస్‌ క్యూబ్స్‌తో ముఖానికి రాసుకుంటున్నారా..అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

ఎండకాలం వస్తుంది కనుక చాలా మంది ఐస్‌ క్యూబ్స్‌ను ముఖానికి రాసుకుంటారు. అలా రాసుకోవడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటాం. ఇలా ఐస్‌ క్యూబ్స్‌ రాయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
ముఖానికి రాసుకునే సౌందర్య ఉత్పత్తులను చర్మం త్వరగా గ్రహించడానికి కూడా ఐస్‌ క్యూబ్స్‌ ఉపకరిస్తాయి. క్రీమ్‌ లేదా సిరమ్‌ వాడిన తర్వాత ముఖాన్ని ఐస్‌ క్యూబ్స్‌తో రుద్దితే చర్మం మెరుపులు చిందిస్తుంది.
ఐస్‌ క్యూబ్స్‌ను వస్త్రంలో చుట్టి దానితో నల్లని వలయాల మీద సున్నితంగా రుద్దితే ఫలితం ఉంటుంది.
మేకప్‌ వేసుకునే ముందు ఐస్‌ క్యూబ్‌ లేదా ప్యాక్స్‌ వాడితే మేకప్‌ ఎక్కువసేపు ఉంటుంది
పొడి పెదవులపై ఐస్‌క్యూబ్స్‌ను సున్నితంగా రుద్దితే వాటిపై ఉన్న పగుళ్లు పోతాయి. మిల్క్‌ ఐస్‌ క్యూబ్స్‌ను చర్మంపై రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. పొడివస్త్రంలో ఐస్‌క్యూబ్స్‌ వేసి దానితో ముఖంపై మసాజ్‌ చేస్తే మొటిమలు తగ్గి పోతాయి. చర్మంపై ఉండే ముడతలు పోతాయి.
ఐస్‌క్యూబ్‌తో రుద్దడం వల్ల చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.

Related posts