telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

డ్రై-ఫ్రూట్స్‌ తింటున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి

సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. అయితే మనలో చాలా మందికి ఈ ‘ఎండిన పండ్లు’ గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి ఏవిధంగా పనిచేస్తాయో తెలియదు. తెలుసుకోరుకూడా.. అదే సమయంలో కొంతమంది స్వీట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టంచూపుతుంటారు. బయట బేకరీల్లో, స్వీట్స్ స్టాల్స్ లో, మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల స్వీట్స్ మీద ఈ డ్రైఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసి, క్యాండీలకు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయాలుగా ఆకర్షిస్తుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని ఒత్తిడి వల్ల భోజనం చేసే సమయం కూడా ఉండదు. అటువంటి సమయంలో ఎక్కువ సమయం వృథా కాకుండా ఈ డ్రైఫ్రూట్స్ (ఎండిన పండ్లు) ఉత్తమ ప్రత్యామ్నాయం. ఎండిన పండ్లును ఒక్కొక్కటే నోట్లో వేసుకొని నమలడం వల్ల రుచిగా అనిపించడమే కాకుండా మీ ఆకలిని తెలియనివ్వదు. ఈ డ్రైఫ్రూట్స్ లో రుచి మాత్రమే కాదు అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. సలాడ్స్ మీద వీటితో గార్నిష్ చేయడం కూడా చాలా ఆరోగ్యకరం. మరి డ్రై ఫ్రూట్స్(ఎండిన పండ్లు) యొక్క న్యూట్రీషినల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం….
ఆప్రికాట్:
ఇందులో అధిక శాతంలో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ మరికు సి, పొటాషియం, అదేవిధంగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండిన పండు తినడం వల్ల శరీరంలో బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ఇది అనీమియా(రక్తహీనత)తో బాధ పడేవారికి చాలా ఉత్తమం. అలాగే జీర్ణ సంబంధిత మరియు మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ తీసుకోవడం వల్ల శరీరం, అంటువ్యాధులు సోకకుండా పోరాడటానికి దెబ్బతిన్న కణజాలాల డ్యామేజ్ ను అరికట్టడానికి, బలమైన పళ్ళు, ఎముకలు నిర్మించడానికి సహాయం చేస్తుంది. మరియు కంటి చూపు మెరుగుపరుస్తుంది.

Related posts