telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఖర్జురా ఆ సమయంలో తీసుకుంటా.. ఇక పండగే

ఖర్జూరాన్ని ఆంగ్లం లో డేట్ పాం అంటారు.ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే వృక్షం. కొమ్మలు లేనిచెటు, తలపైన గుట్టగా గొడుగులా ఆకులు ఉంటాయి, తాటి,ఈత చెట్లలాంటిది.పామే కుటుంబానికి చెందినది. ఎత్తుగా ఆకాశం లోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. 5-8ఏళ్లకు ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు – డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఖర్జూర పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మూడు రకాలుగా చెప్పవచ్చు.అవి
మెత్తనివి, కొంచెం ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినవి .
మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా . రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా . మూడో రకంలో తేమ అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటుంది.. ఇక రంగు రుచి ఆధారం గా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే ‘కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌’ అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని ‘హనీ బాల్‌’ అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ‘డెగ్లట్‌ నూర్‌’, పుడ్డింగ్‌లా కనిపించే ‘ఖాద్రావి’, అచ్చం తేనెలా ఉండే ‘హనీ’, నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగి పోయేలా ఉండే ‘బ్లాక్‌ డేట్‌’, పొడవుగా కాస్త జేగురు రంగులో ఉండే ‘గోల్డెన్‌ ప్రిన్సెస్‌’… ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. తెలుగు పర్యాయపదాల్లో మధుక్షీరము అనేపేరుంది. అంటే పాలతో కలిసిన కమ్మని తీపి రుచికలిగినదని చెప్పుకోవచ్చు.
ఇతర పండ్లు ఏవైనా పండుగానే తింటాము, కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరం లోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి కోస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచు తారు. కోశాక వాటి ని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో పసిపిల్లలకు ఎండుఖర్జూరపు నీళ్లు ఇస్తే వేసవి బధిచదని ఆనీరు పడతారు. పండని పళ్లను కిమ్రి అని, పెద్దవిగా పెరిగి కరకర లాడే ఖర్జూరాలను ఖలాల్‌ అని, పక్వానికొచ్చి మెత్తబడినవాటిని రుతాబ్‌ అని, ఎండు ఖర్జూరాలను తరమ్‌ అని పిలుస్తారు. ఈ అరబిక్‌ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది.

Related posts