telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇంట్లో ధనియాలు వాడుతున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. .ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియ అని అంటారు.  దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుంది. ఆకులు చిన్నగా ఉండి, సువాన కలిగి ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏర్పడుతాయి. దీని కాయ రెండు దళాలుగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ రెండు బీజాలు ఉంటాయి. ధనియాలు మొక్క దశలో ఉన్నప్పుడు దానిని మనం కొత్తిమీర అని వ్యవహరిస్తాము. దీనిని కూడా వంటలలో తరచుగా ఉపయోగిస్తాము.
ధనియాలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కిళ్లు, జ్వరా లను తగ్గిస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. రుచిని పెంపొంది స్తాయి. ఆకలిని పెంచుతాయి. సుఖ నిద్ర కలుగజేస్తాయి.
ఔషధోపయోగాలు:
– ధనియాలను వేయించి పొడి చేసి పూటకు సగం చెంచా చొప్పున క్రమం తప్ప కుండా తింటే శరీర దౌర్బల్యం తగ్గుతుంది.
– ధనియాలను కషాయంగా కాచుకుని అందులో పంచదార కలిపి తాగితే అతి దాహం తగ్గుతుంది.
– ధనియాలు చూర్ణం, పంచదార కలిపి బియ్యపు కడుగు నీటితో తీసుకుంటే శ్వాస, కాసలు తగ్గుతాయి.
– ధనియాలు, శొంఠి కలిపి కషాయం తీసుకుని సేవిస్తే అజీర్ణం తగ్గుతుంది.
– ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది.
– ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతిలో వేయించి, ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
– ధనియాల కషాయానికి సమంగా తేనె కలిపి ఒక కప్పు మోతాదుగా సేవిస్తే మూత్రం ద్వారా జరిగే ఇంద్రియ నష్టం తగ్గుతుంది.
– ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి.
-ధనియాలు, బార్లి గింజలు సమంగా నూరి వాపు ఉన్నచోట లేపనంగా వేస్తే వాపు తగ్గుతుంది.

Related posts