telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఆముదాలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

చర్మానికీ ఆముదం మంచిది. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదాన్ని వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది. ఎలాగో తెలుసా!
కొందరికి ముఖంపై అక్కడక్కడా మచ్చలుంటాయి. వయసురీత్యా వచ్చే ఈ మచ్చల్ని కనిపించకుండా చేయాలంటే.. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని మచ్చలున్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
* గోళ్లు పొడిబారి, వాటి మధ్యలో గీతలు పడ్డాయా? రాత్రిళ్లు పడుకునేముందు గోళ్లకు ఆముదాన్ని రాసి చూడండి.
* స్నానానికి వెళ్లేందుకు పదిహేను నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది మృతకణాల్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
* కాలంతో సంబంధంలేకుండా కొందరికి పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు రాత్రిళ్లు పడుకునేముందు అరిపాదాలకు గోరువెచ్చగా చేసిన ఆముదాన్ని రాసుకోవాలి. మర్నాడు కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి.
* వయసుపెరిగేకొద్దీ ముడతల సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నచోట ఆముదాన్ని రాసి అరగంట అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
* పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతున్నాయా.. వాటికి కొద్దిగా ఆముదాన్ని రాసి చూడండి. ఆ సమస్య తగ్గడమే కాదు, పెదవులూ మృదువుగా మారతాయి.

Related posts