telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇంట్లో కర్పూరం వాడుతున్నాారా…!

కర్పూరం లాభాలివే..

కర్పూరంలో నెయ్యి వేసి పేస్టులా చేసి దాన్ని గాయాలపై రాసుకుంటే రక్తస్రావం తగ్గుతుంది. అంతేకాదు గాయాలకు చీము పట్టకుండా, ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా చూస్తుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు కర్పూరం-నెయ్యి పేస్ట్‌ను కణ తలకు రాసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అలాగే వాపు ఉన్న చోట కర్పూరం పేస్టును రాస్తే ఫలితం ఉంటుంది
కర్పూర తైలాన్ని కొద్దిగా నీటిలో వేసి, ఆ నీటితో దద్దుర్లు వచ్చిన చోట, చర్మం ఎర్రబారిన చోట రాసుకుంటే సమస్య తగ్గును.
రాత్రిపూట పడుకునే ముందు కొన్ని చుక్కల కర్పూర తైలాన్ని దిండు మీద చల్లాలి. కర్పూర తైలం వాసన పీల్చితే చక్కగా నిద్ర పడుతుంది.
కర్పూరం జలుబు, దగ్గును నయం చేస్తుంది. అందుకే ఎన్నో వేపోరబ్స్‌లో కర్పూరాన్ని వాడతారు.
తలకు నిత్యం మీరు రుద్దుకునే నూనెలో కొద్దిగా కర్పూర తైలం కలిపి మాడుకు రాసుకోవాలి. దీంతో మాడ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగి కురులు తొందరగా పెరుగుతాయి.
తలలో పేలను కూడా కర్పూర తైలం తొలగిస్తుంది. అందుకు ఏం చేయాలంటే తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్లల్లో కొద్దిగా తైలం వేస్తే సరిపోతుంది.

Related posts