telugu navyamedia
health trending

జొన్నరొట్టెలు తింటున్నారా.. అయితే ఈ నిజాలు తెలుసుకోండి

జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే.. జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలుకూడా వీటిలో ఎక్కువ. గుండె జబ్బులు రాకుండాఅడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరం లో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్న ల్లో లభిస్తుంది. నరాలబలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది, అందుకు అవసరమైన హార్మోన్ల ను వృద్ది చేస్తాయి. జొన్న రొట్టెతే అద్భుతమైన లాభాలు ఉన్నాయి.. కాబట్టి అందరు దీన్ని క్రమం తప్పకుండ తినండి. 

Related posts

“రూలర్” ఫస్ట్ సాంగ్… ” అడుగడుగో యాక్షన్ హీరో”

vimala p

బ్రేకింగ్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా..

Vasishta Reddy

బిగ్ బాస్-3 : బిగ్ బాస్ ను తమ ఇంటికి ఆహ్వానించిన వ‌రుణ్ నాన‌మ్మ

vimala p