telugu navyamedia
ఆరోగ్యం

రక్తపోటును అదుపులో ఉంచే ‘యాలకులు’

మన వంటిల్లే ఒక వైద్యశాల. అందులో మనం వాడే దినుసులు అన్నీ ఆరోగ్యహేతువులే. ముఖ్యంగా యాలకులతో బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. దీని శాస్త్రీయనామం‘ఇలటేరియా కార్డిమమ్‌’. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుంటాయి. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు. పోషకాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తరుచూ తినడం వల్ల అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యలలో ఊబకాయం ఒకటి. అందరూ కడుపు నిండా తిని… అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ రోజువారీ జీవనశైలిని మార్చుకోమంటే మాత్రం అంగీకరించరు. ఆఫీసులో కూర్చుని పనిచేసేవారికి.. ప్రధానంగా పొట్టలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చుని పని చేయడమే. మనం తినే ఆహారం, శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు తీవ్రమవుతాయి.

*రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది.
*చిన్న యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, కాల్షియం బరువును నియంత్రిస్తుంది.


*యాలకులలోని పొటాషియం, ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాలకులు రోజూ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
* యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటికెలో మటుమాయమవుతుంది.
*యాలకుల గింజలు నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
*యాలకులను నమలడం ద్వారా ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్‌) కూడా తగ్గుముఖం పడతాయి.
*యాలకులు కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
*యాలకుల పొడి, సొంటిపొడి 0.5గ్రాముల చొప్పున సమపాళ్ళలో తయారుచేసుకుని అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే, కఫాన్ని నిర్మూలించి, దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Related posts