telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

పొట్టుతో .. పల్లీలు ఎందుకు తినాలో తెలుసా.. ?

peanuts and health benefits to all

శుభ్రత పేరు చెప్పి ప్రతి దాని తోలు లేదా తొక్క లేదా పొట్టు తీసేసి తినడం అలవాటు అయ్యింది. పల్లీలు కూడా అలాగే తినడం అలవాటు అయిపోయింది. కానీ ఉన్న బలం అంతా కూడా పైన పొట్టులోనే ఉంటుందంటున్నారు నిపుణులు. వీటితో కూడా ప‌లు ర‌కాల వంట‌కాలు చేసుకుని తింటుంటారు. కొంద‌రు వాటితో స్వీట్లు చేసుకుని తింటే.. కొంద‌రు చ‌ట్నీలు, కూర‌లు చేసుకుంటారు. అయితే ఏ విధంగా తిన్నా స‌రే.. ప‌ల్లీల‌తో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ కొంద‌రు ప‌ల్లీల‌ను పొట్టు తీసేసి తింటుంటారు. అలా చేయ‌రాదు. నిజానికి ఆ పొట్టులోనూ మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాలు ఉంటాయి. ప‌ల్లీల పొట్టు తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

no heart attack with 30gms of peanuts consumption* ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తింటే.. ఆ పొట్టులో ఉండే బ‌యోయాక్టివ్స్‌, ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చేస్తాయి.

* ప‌ల్లీల పొట్టులో ఉండే పాలీఫినాల్ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. చ‌ర్మం ఎండిపోకుండా మృదువుగా ఉంచుతుంది.

* ప‌ల్లీల‌ను పొట్టుతో స‌హా తింటే అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

* ప‌ల్లీల‌ను పొట్టుతో తింటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* శ‌రీరంలో పేరుకుపోయే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

Related posts